![]() |
![]() |

సోషల్ మీడియాలో విష్ణు ప్రియ, రీతూ చౌదరి హావా సాగుతుంది. రోజు రోజుకి వీరి అందాల ఆరబోత ఎక్కువ అవుతుంది.
యాంకర్ విష్ణు ప్రియ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రీతూ చౌదరి ఓ హాట్ అండ్ బోల్డ్ ఫోటోని షేర్ చేసింది. దానికి పాజిటివ్ కామెంట్లతో పాటు నెగెటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఆ కామెంట్లలో విష్ణు ప్రియ చేసిన ఓ కామెంట్ వైరల్ గా మారింది. " కొత్త కొత్త అందాలు యాయ్ రీతూ" అని విష్ణు ప్రియ కామెంట్ చేయగా.. ఒరేయ్ ప్లీజ్ దయచేసి వదిలేయ్.. నేను ఎవరికీ దొరకనని రీతూ రిప్లై ఇచ్చింది. ఇక ఈ కామెంట్లని యాంకర్ విష్ణు ప్రియ షేర్ చేశాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట రీతూ చౌదరి కామెంట్ల మీద, ఫోటోల మీద నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
.webp)
రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కామెంట్లు మరింత వైరల్ గా మారాయి.
![]() |
![]() |